ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆర్డీవో కీలక సూచన

భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రాలపై చర్చించారు. 2025 నవంబర్ 11లోగా డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, దాని ప్రతిని సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. గతంలో ఓటు వేసినవారు కూడా మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించారు.



