← Back to news

వృద్ధుల కోసం అవగాహన ర్యాలీ

By Bala· 1h ago
వృద్ధుల కోసం అవగాహన ర్యాలీ

వనపర్తిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధుల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు జరిగిన ర్యాలీని అదనపు కలెక్టర్ బీమ్యా నాయక్ ప్రారంభించారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా వారి అవసరాలను గుర్తించి అండగా నిలవడం సమాజ బాధ్యత అని ఆయన అన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

More in Local