కిడ్నీ స్టోన్ కోసం వెళ్తే.. రెండు కిడ్నీలు తీసేశారు!
మధ్యప్రదేశ్‌లోని సత్నాలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. కిడ్నీలో రాళ్ల తొలగింపు కోసం ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లిన రవిరాజ్ అనే వ్యక్తికి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రెండు కిడ్నీలను తొలగించారు. పరిస్థితి విషమించి ఇన్ఫెక్షన్ సోకడంతో ట్రీట్మెంట్ మద్యలోనే అతను చనిపోయాడు. డాక్టర్ తన తప్పు ఒప్పుకోవడంతో స్థానికులు భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అక్కడ పెద్ద Sensation అయ్యింది.



