ESI హాస్పిటల్లో మందుల కొరత?

TG: వరంగల్ లేబర్ కాలనీలోని ESI హాస్పిటల్లో మందులు, అవసరమైన మెషినరీ అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అత్యవసర సమయంలో కొన్ని మందులు, వస్తువులు దొరకడం లేదని సమాచారం. 50 పడకల హాస్పిటల్లో 36 పడకలు మాత్రమే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11.30 గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని రోగులు చెబుతున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి, అవసరమైన మందులు, మెషినరీ అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.


