అధిక వడ్డీలతో నిరుపేదలకు ఇబ్బందులు

తిరుమలాయపాలెం మండలం గోల్‌తండ, జింకలగూడెం గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అత్యవసర సమయంలో తీసుకున్న అప్పులకు భారీ వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పారు. అప్పులు, వడ్డీలు చెల్లించాలని కొందరు ఒత్తిడి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి వడ్డీ వ్యాపారులపై విచారణ జరిపి, పేదలకు రక్షణ కల్పించాలని కోరారు.



