ఏఎన్‌ఎంపై చర్యలు తీసుకోవాలి.. ఆశాల వినతి

TG: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో షాగాపూర్ సబ్ సెంటర్‌కు చెందిన ఆశాకార్యకర్తలు ఏఎన్‌ఎం సుమిత్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆశావర్కర్స్ యూనియన్ మండల నాయకులు రేణుక, మహేశ్వరి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు తమ విధులను బాధ్యతగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఏఎన్‌ఎం సుమిత్ర తమపై అనవసర ఒత్తిడి తీసుకురావడంతోపాటు వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.



