← Back to news

ఆరు గుంటల స్థల సమస్యపై కలెక్టర్‌కు వినతి

By rajinikanth nagilla· 1h ago· Gatlanarsingapur, Bheemadevarpalli, Hanumakonda
ఆరు గుంటల స్థల సమస్యపై కలెక్టర్‌కు వినతి

TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఆరు గుంటల స్థల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ స్థలానికి సంబంధించిన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో సమస్యను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోడిగే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

More in Local