← Back to news

LPU నిరసనల్లో షాకింగ్ సీన్!

By Mahesh· 1h ago· X

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో విద్యార్థుల నిరసనలు తీవ్రంగా మారాయి. యూని మాల్‌లోని పలు షాపులను నిరసనకారులు ధ్వంసం చేసి, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, పర్ఫ్యూమ్‌లు, వంటి వస్తువులతో పాటు క్యాష్‌ను కూడా తీసుకెళ్లినట్లు షాపు ఓనర్స్ ఆరోపించారు. కానీ అక్కడి పుస్తకాల షాప్ మాత్రం చెక్కుచెదరలేదు. ఒక్క పుస్తకం కూడా తీసుకెళ్లలేదు. ‘పుస్తకాలు వారికి ఉపయోగపడవు కాబట్టే వదిలేశారు’ అని మాల్ స్టాఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన <a href="https://x.com/nocapshrek/status/2104535130517979487">వీడియోలు వైరల్</a> అవుతున్నాయి.

More in Current Affairs