జార్ఖండ్ లో ఎగ్జామ్ స్కామ్: మరొకరి అరెస్ట్

JSSC-CGL పరీక్షల అక్రమాల కేసులో జార్ఖండ్ సీఐడీ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. పలామూ జిల్లాకు చెందిన కుందన్ కుమార్‌ను అదుపులోకి తీసుకోవడంతో, ఈ వ్యవహారంలో మొత్తం అరెస్టుల సంఖ్య 10కి చేరింది. 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఈ పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసినప్పటికీ, హైకోర్టు దానిపై స్టే విధించింది. ప్రస్తుతం సీఐడీ సిట్ బృందం ఈ కేసుపై విచారణ జరుపుతోంది.



