మహువా మోయిత్రాకు ఇండిగో ఫ్లైట్‌లో వేధింపులు
కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (6E-2476)లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కొందరు ప్రయాణికులు ఆమెను ఉద్దేశించి 'చోర్ చోర్' అని నినాదాలు చేస్తూ హేళన చేశారు. దీనిపై ఆమె ఇండిగో యాజమాన్యానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల భద్రత, విమానయాన నిబంధనల ఉల్లంఘనపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.



