← Back to news

పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

By Mutyala Ravindar· 46m ago· Kapra, Secunderabad, Hyderabad
పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

TG: హైదరాబాద్ నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల ప్రారంభం నుంచి అసెంబ్లీ నిర్వహణతో పాటు పాఠాలు బోధించడం, వివిధ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులు పి.విమల, టి.యాదయ్య, జి.అరుణ, కే.సంధ్య, హిమబిందులను పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు ముత్యాల రవీందర్ సన్మానించారు. ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టి.కవిత, ఎస్.సుజిత, ప్రశాంతి, అనిల్ కుమార్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

More in Local