← Back to news

తపాలా శాఖలో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు

By saraswathi rao· 26 Aug 2026· Ambedkar Konaseema
తపాలా శాఖలో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు

AP: విదేశాల నుంచి నగదు పంపిణీ చేసుకునే వారికి తపాలా శాఖలో అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని కోనసీమ జిల్లాలోని అమలాపురం డివిజన్ తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ చెరుకూరి శ్రీనివాస్ తెలిపారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ అనుబంధ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రియామి ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

More in Local