రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

TG: వరంగల్ జిల్లా నెక్కొండలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలను కలెక్టర్ సత్య శారద ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలు, బోధనా విధానం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి చదువు, వసతి, భోజనం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల, కళాశాలలోని సౌకర్యాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.



