← Back to news

2030 నాటికి భారీగా పెరగనున్న మార్కెట్!

By A.Ajay· 3h ago
2030 నాటికి భారీగా పెరగనున్న మార్కెట్!

ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల మార్కెట్.. 2030 నాటికి 3లక్షల కోట్ల నుంచి 3లక్షల 25వేల కోట్లకు చేరే ఛాన్స్ ఉందని BCG, CII జాయింట్ రిపోర్ట్ తెలిపింది. ఏటా 8 నుంచి 10 పర్సెంట్ గ్రోత్ ఉండొచ్చని అంచనా వేసింది. ఫ్యామిలీ ఇన్‌కమ్ పెరగడం, ఈజీగా లోన్స్ లభించడం, న్యూ ప్రొడక్ట్స్ కొనేవారి సంఖ్య పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని తెలిపింది. దేశంలోనే వస్తువుల తయారీ పెరిగితే మరో 40 వేల నుంచి 50 వేల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు ఏర్పడొచ్చని రిపోర్టు తెలిపింది.

More in Technology