← Back to news

కరీంనగర్‌లో పీఎంజే జ్యుయెలరీ షాప్ లో భారీ దోపిడీ !

By DS· 3 May 2026· Telangana

కరీంనగర్ లోని పట్టణంలోని పీ ఎం జే జ్యువెలరీ షాపులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది...పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు..! నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై డీజీపీ సివి ఆనంద్ ఆరా తీశారు.నగరాన్ని అష్ట దిగ్బంధనం చేసి గాలిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.