← Back to news

పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయా: ఢిల్లీ స్టూడెంట్

By Vishi· 5h ago

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 'అదిర' అనే విద్యార్థినిపై పోలీసులు దాడి చేశారు. అదుపులోకి తీసుకునే టైంలో మహిళా పోలీసులు లేకుండానే బస్సును కదిలించారని, తనను రోడ్డుపై ఈడ్చుకెళ్లారని ఆమె ఆరోపించారు. పోలీసు సిబ్బంది తనను బేస్‌మెంట్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని అదిర తెలిపారు. ముఖంపై, కడుపుపై గుద్దడంతోపాటు తన ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేశారన్నారు. ఒక చెవిపై బలమైన దెబ్బ తగలడంతో ఆ చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయిందని తెలిపారు.

More in Current Affairs