వరంగల్ జిల్లాలో ఘోరం: యువతిపై సామూహిక అత్యాచారం, హత్య!

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలో 21 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెను ఉరి వేసి చంపేశారని, నిందితులు రావూరు తండాకు చెందినవారని, తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా వర్ధన్నపేట జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



