పీడియాట్రిషన్ అకాడమీకి డాక్టర్ శివరంజని సంతోష్ రాజీనామా

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సభ్యత్వానికి రాజీనామా చేశారు. నకిలీ ORS పానీయాలపై గత ఎనిమిదేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటం ఇంటర్నెట్ ని షేక్ చేసింది.ఫార్మా కంపెనీలు ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తూ వేధిస్తున్నాయి. తన పోరాటాన్ని మాతృసంస్థ IAP గుర్తించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. పిల్లల ఆరోగ్యం లేదా IAP.. ఈ రెండింటిలో ఏది కావాలంటే పిల్లలనే ఎంచుకుంటాను చెప్పారు.



