← Back to news

నవులూరు జెడ్పీ స్కూల్‌కు స్పోర్ట్స్ కిట్స్

By epuri rajaratnam· 1h ago· Nutakki, Mangalagiri, Guntur
నవులూరు జెడ్పీ స్కూల్‌కు స్పోర్ట్స్ కిట్స్

గుంటూరు జిల్లాలోని గళగిరి మండలం నవులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మిడ్‌వాలీ సిటీ మహిళా సభ్యులు రూ.30 వేల విలువైన క్రీడా సామాగ్రిని అందజేశారు. నాదెళ్ల క్రాంతి ఆధ్వర్యంలో పీ4 కార్యక్రమంలో భాగంగా వాలీబాల్, షటిల్, టెన్నికాయిట్, కోకో తదితర క్రీడలకు సంబంధించిన సామాగ్రి అందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేందుకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల HM, పీ4, మిడ్‌వాలీ టీం పాల్గొంది.

నవులూరు జెడ్పీ స్కూల్‌కు స్పోర్ట్స్ కిట్స్

More in Local