← Back to news

'ప్రైమరీ టీచర్ల ప్రాణాలు కాపాడండి`

By Ramakrishna Ameraboina· 1h ago· Krishna Nagar Colony, Suryapet, Suryapet
'ప్రైమరీ టీచర్ల ప్రాణాలు కాపాడండి`

సూర్యపేట జిల్లా చివ్వెంల మండలం కాంప్లెక్స్ సమావేశంలో భోజన విరామ సమయంలో SGTలపై ఒత్తిడి తగ్గించాలని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జీవో 25 సవరించి తరగతికి ఒక టీచర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా చిల్వకోడూరు పాఠశాల ఉపాధ్యాయుడు ప్రశాంత్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో 'Save Primary Teacher- Save Primary School' పేరిట టీచర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

More in Local