← Back to news

'సిగరెట్ బాబా'గా మైనర్ బాలుడు!

By sahani· 9 Apr 2026· Telugu Report· Gujarath

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఒక మైనర్ బాలుడు సిగరెట్లు తాగుతుండగా, జనం అతడిని 'బాబా'గా భావించి ఆశీర్వాదాల కోసం ఎగబడుతున్నారు. బాలుడు పొగ పీలుస్తుంటే భక్తులు నోట్ల వర్షం కురిపిస్తూ, పాదాభివందనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ అంధవిశ్వాసంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయడం, సమాజం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.