← Back to news

ఆశావర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి: MLA సంజయ్

By Anand Chittari· 26 Aug 2026· Hyderabad
ఆశావర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి: MLA సంజయ్

TG: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాకు కోరుట్ల MLA సంజయ్ మద్దతుగా నిలిచారు. హైదరాబాద్‌లోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ఆశావర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆశావర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి: MLA సంజయ్

More in Local