← Back to news

కడప.. జిల్లా బద్వేలులో ఘర్షణ

By Krishna· 58m ago

AP: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ ఆఫీసులో TDP, YCP కార్యకర్తలు గొడవకు దిగారు. నామినేషన్ వేసేందుకు ముందుగా తాము వచ్చామంటే, తాము వచ్చామని ఘర్షణ పడ్డారు. పోలీసుల ముందే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వారిని అదుపు చెయ్యడానికి పోలీసులకు అరగంట పట్టింది. ఇలా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

More in AP