AP హైకోర్టులో YCP పిటిషన్

AP: తిరుపతి, కడప, పులివెందులలో తమ అభ్యర్థులపై TDP గూండాలు దాడులు, హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. YCP ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల దగ్గర పారా మిలిటరీ ఫోర్స్ని ఏర్పాటు చెయ్యాలని కోరింది. పోలీసులు ఉన్నా.. పట్టించుకోవట్లేదనీ, రక్షణ కల్పించట్లేదని పిటిషన్లో కంప్లైంట్ చేసింది. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా YCP సవాల్ చేసింది.


