Vizag డేటా సెంటర్.. న్యూయార్క్ టైమ్స్ Video
AP: విశాఖలో అదానీ-గూగుల్ నిర్మిస్తున్న ₹142448 కోట్ల AI డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా.. భారత్ AI రేసులో జోరందుకుంటుందనీ, సైలెంటుగా ఉన్న విశాఖ.. AI హబ్గా మారబోతోందని న్యూయార్క్ టైమ్స్ వీడియో ద్వారా వివరించింది. 3 సైట్లలో నిర్మాణం ప్రారంభమైందని చెప్పింది. ఐతే.. ఇక్కడ నీటి కొరత ఉందనీ, ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్నారనీ, స్థానికుల్లో తీవ్ర ఆందోళన ఉందని వివరించింది. ప్రాజెక్టు పరిధి, ఉద్యోగాల కల్పనపై స్పష్టత లేకపోవడం పైనా చర్చ జరుగుతోంది.

