నారాయణఖేడ్‌లో అంబేద్కర్ యువజన సంఘం ధర్నా

TG: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది. జిల్లా సెక్రటరీ అనుముల తుకారం ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా వారు పేర్కొన్నారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



