ఫెయిల్ భయంతో ఆత్మహత్య... తీరా రిజల్ట్ చూస్తే పాస్ !!

పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఒక తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత ఆమె ఫస్ట్-క్లాస్ మార్కులతో పాస్ అయినట్లు తెలిసింది. మెదక్ జిల్లాకు చెందిన సాయిప్రియ అనే విద్యార్థిని, పరీక్షలలో ఫెయిల్ అవుతాననే తీవ్ర ఆందోళనతో ఏప్రిల్ 24న ఆత్మహత్య చేసుకుంది. ఫెయిల్ అయినా పర్వాలేదని తల్లిదండ్రులు భరోసా ఇచ్చినప్పటికీ, ఆమె భయం కొనసాగుతూనే ఉంది. మరుసటి రోజు ప్రకటించిన ఫలితాల్లో ఆమె 480 మార్కుల అధిక స్కోరుతో ఉత్తీర్ణత సాధించినట్లు తేలింది..



