← Back to news

ఫారెస్ట్ ఆఫీస్‌‌లోకి చొరబడి రాళ్ల దాడి

By DK· 2 Aug 2026· నిర్మల్ జిల్లా
ఫారెస్ట్ ఆఫీస్‌‌లోకి చొరబడి రాళ్ల దాడి

TG: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో అధికారులపై దాడిచేసి, రూ.50వేల ఆస్తి నష్టం చేసిన ఘటనలో 17మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీ ప్రాంతంలోని ROFR భూముల్లో ట్రాక్టర్‌తో దున్నడం నేరమని అటవీ సిబ్బంది రైతులకు చెప్పినా వినకుండా దున్నుతున్నారని అధికారులు తెలిపారు. కొందరు పోడు రైతులు, నాయకులు అటవీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం ఆఫీస్‌లోకి చొరబడి అధికారులను నిర్బంధించి బండరాళ్లతో దాడి చేసినట్లు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in TG