మేక్ ఇన్ ఇండియా.. గ్రోత్ ఉంది, గ్లోబల్ షేర్ లేదు!

‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా దేశంలో తయారీ రంగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ప్రపంచ మార్కెట్‌లో భారత్ వాటా మాత్రం పెద్దగా పెరగలేదు. పెట్రోలియం కాకుండా ఇతర వస్తువుల ఎగుమతులు 2014-15లో 253.5 బిలియన్ డాలర్ల నుంచి 388.3 బిలియన్ డాలర్లకు 2025-26లో పెరిగాయి. కానీ ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో భారత్ వాటా 1.7 శాతం దగ్గరే ఉంది.
