ఢిల్లీలో ర్యాలీపై పోలీసుల యాక్షన్
ఢిల్లీలో ధర్నా చేస్తున్న యూత్ కాంగ్రెస్ క్యాడర్‌ని పోలీసులు అడ్డుకున్నారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ హైకమాండ్.. దేశవ్యాప్త ప్రొటెస్టుకి కాల్ ఇచ్చింది. అందులో భాగంగా ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ప్రొటెస్ట్ చేస్తుండగా.. బ్రేక్ వేసిన పోలీసులు.. చాలా మందిని అదుపులోకి తీసుకొని, అక్కడి నుంచి తరలిస్తున్నారు. బారికేడ్లు పెట్టి.. ఎక్కడికక్కడ ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆందోళనలు కంటిన్యూ అయ్యే పరిస్థితులున్నాయి.

