← Back to news

ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. షాకింగ్ వీడియో

By Krishna· 4h ago· Instagram

సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 ప్లేన్, సెప్టెంబర్ 15న మష్హద్ నుంచి కెర్మాన్‌షాహ్‌కు వెళ్తూ టేకాఫ్ సమయంలో టైర్ ట్రెడ్ విడిపోయి ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది. క్రూ ఎమర్జెన్సీ అనౌన్స్‌మెంట్ చేశారు. ప్లేన్ తిరిగి మష్హద్‌కి వచ్చింది. ల్యాండ్ అవుతూ బాగా షేక్ అయ్యింది. క్యాబిన్ సీలింగ్ ప్యానెల్స్, ఓవర్‌హెడ్ లాకర్లు విరిగి ప్యాసింజర్లపై పడ్డాయి. ప్రయాణికులు భయంతో అరుస్తూ.. దేవుణ్ని తలచుకున్నారు. ప్లేన్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఎవరికీ గాయాలు కాలేదు. ప్యాసింజర్లను మరో ప్లేన్‌లో కెర్మాన్‌షాహ్‌కి పంపారు.

More in Viral