AI డేటా సెంటర్ పనులు బంద్.. ఎందుకో తెలుసా?

ఇండోనేషియాలో భారీ AI డేటా సెంటర్ నిర్మాణానికి బ్రేక్ పడింది. సింగపూర్‌కు చెందిన BDx కంపెనీ వెస్ట్ జావాలో 640 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన కొన్ని అనుమతులు ఇంకా రాలేదు. ముఖ్యంగా డేటా సెంటర్ వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పూర్తి స్థాయిలో చెక్ చేయలేదు. దీంతో ఆ పనులను వెంటనే ఆపాలని వెస్ట్ జావా గవర్నర్ ఆదేశించారు. పర్యావరణ ప్రభావాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే పనులు కొనసాగించాలని చెప్పారు.



