స్కూల్ మెట్లు కూలి ఏడేళ్ల బాలిక మృతి

బిహార్ రాష్ట్రం ఖగడియా జిల్లాలోని అమ్నీ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ మెట్లు కూలిన ఘటనలో 7 ఏళ్ల బాలిక రితికా కుమారి మరణించింది. మరో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మెట్లు కూలినప్పుడు పిల్లలు కింద పడిపోయి శిథిలాల్లో చిక్కుకున్నారు. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ఘటనకు కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.


