← Back to news

గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక సేవల్లో పోస్టాఫీస్ కీలకం

By Kamal Kumar· 1h ago· Vikarabad, Vikarabad, Vikarabad
గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక సేవల్లో పోస్టాఫీస్ కీలకం

ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉత్తరాలు, పార్శిళ్ల పంపిణీతోపాటు బ్యాంకింగ్, పొదుపు పథకాలు, బీమా, పెన్షన్ సేవల ద్వారా తపాలాశాఖ ప్రజలకు సేవలందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక, సమాచార సేవలను చేరవేయడంలో పోస్టాఫీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ సమాచారాన్ని, ఆర్థిక సేవలను చేరువ చేస్తున్న వికారాబాద్ జిల్లా తపాలా శాఖ సిబ్బందికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More in Local