ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలి

AP : రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా నంది మండలంలో SI తులసి నాగ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలంతా శాంతితో ఉండాలని, గొడవలకు దూరంగా ఉండాలని SI సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.



