← Back to news

భర్త నల్లగా ఉన్నాడని…

By aravinda nyayapati· 10 Apr 2026· Telugu Report· Hyderabad
భర్త నల్లగా ఉన్నాడని…

భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అత్యంత ఘోరానికి పాల్పడింది. ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసి అతనిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. మధ్యప్రదేశ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. పురోహిత్ దేవ్ కృష్ణ ఈ నెల 7న అతని ఇంట్లో శవమై కనిపించాడు. డబ్బుల కోసమే ఎవరో అతనిని చంపారన్నట్టుగా భార్య ప్రియాంక ఇంటిని క్రియేట్ చేసింది. పోలీసులు కూడా మొదట రాబరీలో భాగంగానే హత్య జరిగిందని అనుకున్నారు. కానీ విచారణలో ప్రియాంక తన ప్రియుడు కమలేష్ తో కలిసి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి ప్రొఫషనల్ కిల్లర్స్ తో హత్య చేయించిందని తేలింది చాలా రోజులుగా ప్రియాంక తన భర్తని నువ్వు నల్లగా ఉన్నావంటూ హేళన చేసేదని, నువ్వు నాకు సరిపోవంటూ వేధించేదని కుటుంబ సభ్యులు చెప్పారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.