← Back to news

నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ

By DK· 24 Jun 2026· Ntnews· నల్గొండ జిల్లా
నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ

TG: నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నలుగురు కుటుంబసభ్యులు దారుణ హత్య మిస్టరీ వీడడం లేదు. నాలుగు హత్యలు ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తండ్రి సుల్తాన్‌కు ఆరు కత్తిపోట్లు, కుమారుడు ముజామ్మిల్‌కు 12, హసీనాకు 8, కూతురు అప్సర్‌ శరీరంపై తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కానీ హత్యలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.