← Back to news

BRS లీడర్స్‌కు జూపల్లి మరోసారి ఓపెన్ ఛాలెంజ్!

By sahani· 3 Jul 2026· Telangana

మంత్రి జూపల్లి కృష్ణారావు BRSకు మరోసారి సవాల్ విసిరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అప్పులపై ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. BRS తీరు 'ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ డెడ్' లా ఉందని విమర్శించారు. తన లెక్కలు తప్పని నిరూపిస్తే తాను మినిస్టర్ పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ BRS తప్పు తేలితే KTR, హరీష్‌రావు రిజైన్ చేసి పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.

More in Politics