మహిళపై దాడి..చేతబడి అనుమానంతోనే?
TG: రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. మంచాల మండలం నోముల గ్రామంలో పల్లటి వెంకటమ్మ అనే 60 ఏళ్ల మహిళను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆమె చేతబడి చేస్తోందన్న అనుమానమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, 14 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి విషయాలపై మనుషుల ఒకరిపై మరొకరు దాడి చేయడం అమానుషం కదా? ఇలాంటివి ఆగాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి.



