రోడ్డుపై వెళ్తున్న గర్భిణిపై 'మానవ మృగం' దాడి!
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మాల్వియా నగర్ ప్రాంతంలో పట్టపగలే ఓ గర్భిణి పట్ల ఒక వ్యక్తి అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ఆమె రోడ్డుపై ఫోన్ మాట్లాడుతూ వెళ్తుండగా, వెనుక నుండి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు ధైర్యంగా కేకలు వేయడంతో ఆ దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు, గర్భిణుల పట్ల ఇలాంటి దారుణాలు జరగడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.



