రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్

AP: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైల్‌లో ప్రయాణికులను బ్లేడ్‌తో భయపెట్టి, వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీన బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అన్నవరం స్టేషన్ వద్ద నలుగురు యువకులు జనరల్ కోచ్‌లోకి ఎక్కారు. గంజాయి మత్తులో రైలులోని ప్రయాణికులపై బ్లేడ్‌తో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను దోచుకున్నారు. అనంతరం రైలు స్లో కాగానే నిందితులు దూకి పారిపోయారు. ఆరుగురు బాధితులు విశాఖపట్నం రైల్వేపోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.



