2 కోట్ల అభివృద్ధి పనులు.. మాజీ జడ్పిటిసికి సన్మానం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ZPTC మోడీ రామాంజనేయులు యాదవ్‌ను మండలానికి చెందిన YSRCP నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించి అభినందించారు. తన పదవీకాలంలో మండలంలో సుమారు ₹.2 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి, సీఎం ఓబుల్ రెడ్డి, ముత్తుజ షావుకార్, రియాజ్, ఎస్. దాని, ఓబుల్ రెడ్డి, తిరుపతి, సుభాని, రాజా, అంజద్‌తో పాటు పలువురు YSRCP కార్యకర్తలు పాల్గొన్నారు.


