ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ఫెయిల్: KTR

TG: ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లు దాటినా అమల్లో విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైరయ్యారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 17వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని RTI ద్వారా బహిర్గతమైందని, 12వేల ఖాళీలు ఉన్నట్టు పలుమార్లు సీఎం, మంత్రులు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. కానీ కేవలం 5వేల ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు.