మీడియాపై మంగ్లీ మండిపాటు...
భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడికి సంబంధించిన కేసులో ఆరోపణలెదుర్కొంటున్న సింగర్ మంగ్లీ కంట్రోల్ తప్పారు. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రమేయం లేదని తేలిన తర్వాత న్యాయవాది సుబ్బారావును ఏం చేస్తారో తనకు మాటివ్వాలని వింత కామెంట్లు చేశారు. నేనూ మీడియా నుండే వచ్చాను అంటూనే తనకు వ్యతిరేకంగా వార్తలు వేయద్దు అన్నట్లుగా రుస రుస లాడారు. మంగ్లీ గతంలో వీ6, హెచ్ ఎం టివీలలో ఓ ప్రోగ్రాంకి యాంకర్ గా పనిచేశారు.



