← Back to news

వెలిజర్లలో అంగడి బజార్ ప్రారంభం

By Adithya D· 26 Aug 2026
వెలిజర్లలో అంగడి బజార్ ప్రారంభం

TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో వారాంతపు అంగడి బజార్ ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ బాబు నాయక్ బుధవారం అంగడి బజార్‌ను ప్రారంభించారు. ఇకపై ప్రతి బుధవారం గ్రామంలో అంగడి బజార్ కొనసాగుతుందని తెలిపారు. రైతులు తమ పంటలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా విక్రయాలు నిర్వహించడం వల్ల ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

More in Local