Latest

ఢిల్లీ మెట్రో ఇంత పెద్ద నెట్‌వర్క్‌గా ఎలా మారింది?
National· 1d ago

ఢిల్లీ మెట్రో ఇంత పెద్ద నెట్‌వర్క్‌గా ఎలా మారింది?

ఒకప్పుడు ఢిల్లీ ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇరుక్కుపోయే నగరం.. ఇప్పుడు మెట్రో లేకుండా ఊహించుకోవడం కష్టం! 2002 డిసెంబర్ 25న షహదారా–తిస్ హజారీ మధ్య తొలి 8.3 కి.మీ మార్గంతో మొదలైన ఢిల్లీ మెట్రో ప్రయాణం, దశలవారీగా నగరం దాటి NCR ప్రాంతాలకూ విస్తరించింది. కొత్త లైన్లు, ఇంటర్‌చేంజ్ స్టేషన్లు, ఎలివేటెడ్–అండర్‌గ్రౌండ్ మార్గాలతో నెట్‌వర్క్ పెరిగింది. ప్రస్తుతం సుమారు 416 కి.మీ, 303 స్టేషన్లతో దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారింది. రోజువారీ ప్రయాణికుల జీవితంలో కీలక రవాణా వ్యవస్థగా మారిపోయింది.

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: పీఏసీ ఛైర్మన్
Local· 1d ago

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: పీఏసీ ఛైర్మన్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 61,482 కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. పేదల కోసం సన్నబియ్యం, క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.

జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే-జడ్పీటీసీ వాగ్వాదం
Local· 1d ago

జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే-జడ్పీటీసీ వాగ్వాదం

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థాయి సంఘ సమావేశం తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మధ్య అభివృద్ధి పనులు, పింఛన్లపై ఆరోపణలు, సవాళ్లు వచ్చాయి. నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రవికుమార్ పేర్కొనగా, ముందుగా ఎంపీటీసీగా గెలిచి చూపించాలని కృష్ణచైతన్య సవాల్ విసిరారు. ఇరువర్గాల మధ్య వాడివేడి వాదనలు, నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు, ఇతర సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేత
Local· 1d ago

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేత

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పురపాలక సంఘాల వార్డుల పునర్విభజనపై దాఖలైన 50 పిటిషన్లను గురువారం కొట్టివేసింది. వార్డుల విభజన సరికాదంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించగా, చట్ట నిబంధనల మేరకే చేస్తున్నామని ప్రభుత్వం వాదించింది. ఇరువర్గాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన వార్డుల ప్రకారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

మంగంపేట బైరైటీస్ కొల్లగొడుతున్నారని నిజనిర్ధారణ కమిటీ ఆందోళన
Local· 1d ago

మంగంపేట బైరైటీస్ కొల్లగొడుతున్నారని నిజనిర్ధారణ కమిటీ ఆందోళన

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని మంగంపేట బైరైటీస్ గనుల మూసివేతపై నిజనిర్ధారణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అరుదైన ఖనిజ సంపదను భారీగా విదేశాలకు తరలిస్తూ జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కమిటీ అభిప్రాయపడింది. గనుల పరిస్థితి, టెండర్లు, ఎగుమతులు, మైన్ క్లోజర్ ప్రతిపాదనలపై అధ్యయనం కోసం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి, విశ్రాంత ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ కమిటీ ఏర్పాటైందని పోరాట కమిటీ కన్వీనర్ కందారపు మురళి తెలిపారు.

హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ రిలీఫ్.. కొత్త ఫ్లైఓవర్ ఓపెన్!
TG· 1d ago

హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ రిలీఫ్.. కొత్త ఫ్లైఓవర్ ఓపెన్!

TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో కీలక ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. నల్గొండ 'X' రోడ్స్‌ నుంచి సైదాబాద్, IS సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్‌ వరకు 3.23 కి.మీ <a href="https://x.com/HiHyderabad/status/2095230414982168691">కారిడార్‌ను</a> CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.620 కోట్ల ఖర్చుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ 4-లేన్ ఫ్లైఓవర్‌తో రూట్‌లో ట్రాఫిక్ జామ్‌లు తగ్గి జర్నీ టైమ్ కూడా సేవ్ కానుంది. ప్రయాణికులకు ఈ కారిడార్‌ బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి.

ISRO రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌..!
National· 1d ago

ISRO రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌..!

రాత్రి ఆకాశం వైపు అందరి చూపు.. ISRO రేపు GSLV-F17 రాకెట్‌తో EOS-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. ప్రత్యేకత ఏంటంటే ఇది జియోసింక్రోనస్ కక్ష్యలో సుమారు 36,000 కి.మీ ఎత్తులో ఉండి, ఒకే ప్రాంతాన్ని నిరంతరం గమనించగలదు. రెండు మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్లతో సరిహద్దులు, ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులను గమనించడంలో ఉపయోగపడనుంది. ఇది దేశ భద్రతతో పాటు విపత్తులపై వేగంగా స్పందించేందుకు కీలకం.

బ్యాంకింగ్, రైల్వేల్లో అవినీతి కంప్లైంట్స్
Current Affairs· 1d ago

బ్యాంకింగ్, రైల్వేల్లో అవినీతి కంప్లైంట్స్

2025లో ప్రభుత్వరంగంపై దేశవ్యాప్తంగా అవినీతికి సంబంధించి 70,500కు పైగా కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. బ్యాంకులపై 9,933, రైల్వేలపై 9,381 ఫిర్యాదులు వచ్చాయి. బ్యాంకింగ్, రైల్వే శాఖల్లోనే అత్యధికంగా అవినీతి కంప్లైంట్స్ వచ్చాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక ప్రకారం, మొత్తం ఫిర్యాదుల్లో 64,905 కేసులను ఆ సంస్థలు సాల్వ్ చేశాయి.

తెలంగాణలో ప్రతి టర్మ్‌లో ఓ మంత్రి బర్తరఫ్.. కొత్త చర్చ!
TG· 1d ago

తెలంగాణలో ప్రతి టర్మ్‌లో ఓ మంత్రి బర్తరఫ్.. కొత్త చర్చ!

TG: రాష్ట్ర పాలిటిక్స్‌లో మంత్రి బర్తరఫ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2015లో అప్పటి సీఎం KCR డిప్యూటీ సీఎం రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. 2021లో మంత్రి ఈటల రాజేందర్‌పై కూడా బర్తరఫ్ వేటు పడింది. తాజాగా 2026లో మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ ముగ్గురిలో రాజయ్య, కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కాగా, ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేత.

రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన KTR
TG· 1d ago

రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన KTR

TG: నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు నీళ్లు రిలీజ్ చేయాలని KTR డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 14లోపు నీటి విడుదలపై క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. సాగర్‌లో 180 TMCల నీరు ఉన్నప్పటికీ, రైతులకు చుక్క నీరు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2003లో రైతుల కోసం KCR చేసిన పాదయాత్ర స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పాలసీలపై పోరాడతామని KTR అన్నారు.

కృష్ణునిపాలెంలో 949 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ
Local· 1d ago

కృష్ణునిపాలెంలో 949 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో సెప్టెంబర్ 5న 949 పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీలో కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరవుతారని మండల తహసీల్దార్ పినిశెట్టి రామకృష్ణ తెలిపారు. లబ్దిదారులందరూ లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని కోరారు.

హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్.. మిస్ అవ్వకండి!
Local· 1d ago

హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్.. మిస్ అవ్వకండి!

హైదరాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్‌లో సెప్టెంబర్ 12, శనివారం సాయంత్రం 4:30 గంటలకు '75 ఇయర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' బుక్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. కల్పనా కన్నాభిరాన్ ఎడిట్ చేసిన ఈ బుక్ లాంచ్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు జ్యోతిర్మయ శర్మ, మంజరి కాట్జు, నాల్సార్ ప్రొఫెసర్ మురళీ కర్ణం, కల్పనా కన్నాభిరాన్ ప్యానెల్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యే వారికి సాయంత్రం 4 గంటలకే టీ సర్వ్ చేయనున్నారు.

నిషు తండ్రి సంజయ్‌పై దాడి.. రేపు పోలీస్ స్టేషన్‌కు CJP నేతలు
National· 1d ago

నిషు తండ్రి సంజయ్‌పై దాడి.. రేపు పోలీస్ స్టేషన్‌కు CJP నేతలు

నిషు తండ్రి సంజయ్ జీపై జరిగిన దాడి ఘటనలో న్యాయం కోసం పోరాడతామని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. NEET స్టూడెంట్స్ కోసం పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తున్న సంజయ్‌పై గ్యాంగ్ ఎటాక్ చేశారని ఆరోపించారు. నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ మర్డర్ అటెంప్ట్ చేసినట్లు ఓపెన్‌గా చెప్పుకుంటున్నారని అన్నారు. క్రిమినల్ గ్యాంగ్స్‌ను దిల్లీ పోలీసులు ప్రొటెక్ట్ చేయడాన్ని అస్సలు ఒప్పుకోం” అని సౌరవ్ దాస్ అన్నారు. రేపు ఉ. 10 గం.లకు CJP సభ్యులతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి న్యాయం కోరుతామని చెప్పారు.

ఏలూరులో ధరలపై న్యూ డెమోక్రసీ భారీ నిరసన
Local· 1d ago

ఏలూరులో ధరలపై న్యూ డెమోక్రసీ భారీ నిరసన

ఏలూరు జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ గురువారం ధరలపై భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, హోటల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫైర్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నినాదాలు చేశారు. బ్లాక్ మార్కెట్ అరికట్టాలని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు.

TET మినహాయింపు కోరుతూ UTF ముట్టడి - అరెస్టుల పర్వం
Local· 1d ago

TET మినహాయింపు కోరుతూ UTF ముట్టడి - అరెస్టుల పర్వం

NTR జిల్లా విజయవాడలో ఇన్సర్వీస్ టీచర్లకు TET మినహాయింపు కోసం UTF నిరసనకు పిలుపునిచ్చింది. సంఘం పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు విద్యాభవన్ వద్దకు చేరుకున్నారు. అనేక ఏళ్లుగా ప్రభుత్వ బడుల్లో బోధిస్తున్న ఇన్‌సర్వీస్ టీచర్లపై TET తప్పనిసరి చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అనుభవం, వయస్సు పరిగణనలోకి తీసుకుని TET మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాభవన్ ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదని ఉపాధ్యాయులను పోలీసులు నిలువరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టులు అయ్యాయి.

కాంగోలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్
International· 1d ago

కాంగోలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్

కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 3,007 మంది మరణించగా 6,186 కేసులు నమోదయ్యాయి. ఆరు ప్రావిన్సులకు ఈ వైరస్ వ్యాపించింది. ఘర్షణలు, వైద్య సిబ్బందిపై దాడులు, బలహీనమైన వైద్య వసతులు ఈ వ్యాప్తికి కారణమవుతున్నాయి. నమోదైన కేసుల కంటే వాస్తవ కేసులు మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ఆఫ్రికా CDC అంచనా వేసింది. ముందు వరుసలోని ఆరోగ్య సిబ్బందికి ఎర్వెబో వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై గుంటూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
Local· 1d ago

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై గుంటూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు జిల్లా పట్నంబజార్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. నిషేధిత ప్లాస్టిక్ గుర్తించి దుకాణాలు సీజ్ చేసి జరిమానాలు విధించారు. 45 రోజులుగా అవగాహన కల్పించినా చర్యలు తీసుకోని సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. తయారీ సంస్థల వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులపై కూడా జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.

తమిళనాడులో ‘ఒలింపిక్ సిటీ’.. విజయ్ కీలక ప్రకటన!
National· 1d ago

తమిళనాడులో ‘ఒలింపిక్ సిటీ’.. విజయ్ కీలక ప్రకటన!

తమిళనాడు స్పోర్ట్స్ సెక్టార్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ‘తమిళనాడు ఒలింపిక్ సిటీ’ ఏర్పాటు చేయనున్నట్లు CM విజయ్ తెలిపారు. ఒలింపిక్ స్టాండర్డ్స్‌తో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా దీన్ని డెవలప్ చేయనున్నారు. అథ్లెట్ల కోసం హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లు ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలో మోటార్‌స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ఫార్ములా 1 నుంచి ఫార్ములా 4 వరకు రేసులు నిర్వహించేలా ఫెసిలిటీస్ డెవలప్ చేస్తున్ననట్లు CM వెల్లడించారు.

శ్రీకాకుళం Redcrossకు గవర్నర్ గోల్డ్ మెడల్
Local· 1d ago

శ్రీకాకుళం Redcrossకు గవర్నర్ గోల్డ్ మెడల్

శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. విజయవాడలో జరిగిన రెడ్క్రాస్ రాష్ట్ర శాఖ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ అవార్డును అందుకున్నారు. రక్తదాన శిబిరాలు, ఆపదల్లో సహాయం చేయడంలో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని రాజాం పట్టణానికి చెందిన చైతన్య కుమార్ అన్నారు.

సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు : మంత్రి
Local· 1d ago

సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు : మంత్రి

జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రూ.67 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన విద్యార్థులతో భోజనం చేసి, వారికి షూస్, బ్యాగులు అందించారు. సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారానికి ఒక రోజు పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.

‘Gen Z’పై ఫోకస్ చేయండి.. మంత్రులతో చంద్రబాబు
AP· 1d ago

‘Gen Z’పై ఫోకస్ చేయండి.. మంత్రులతో చంద్రబాబు

AP: వెలిగొండ, పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు నీరు ఇవ్వడంపై CM చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని అన్నారు. Gen Z సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని, వారికి మన పనులను రీచ్ చేయాలని చెప్పారు. YSRCP చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిచేసిన క్రెడిట్ కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.