Latest

కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన బుయ్యని
TG: కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారితో ప్రయాణికులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు. తాండూర్ పట్టణ సమీపంలోని కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని ఆయన పరిశీలించారు. బ్రిడ్జిపై రహదారి పరిస్థితిని పరిశీలించి ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక సూచికలను కూడా తనిఖీ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

మయన్మార్‌లో మిలిటరీ దారుణం.. బౌద్ధ విహారంపై అటాక్
మయన్మార్‌లో మిలిటరీ దారుణానికి పాల్పడింది. సాగైంగ్ దగ్గరలోని ఓ బౌద్ధ మఠంపై నిన్న ఎయిర్‌స్ట్రైక్ చేసింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బౌద్ధుల వారం రోజుల ధ్యాన కార్యక్రమం జరుగుతుండగా అటాక్ జరిగింది. దాదాపు 100 మంది అక్కడ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఫైటర్ జెట్ రెండు బాంబులు వేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఘటనపై మయన్మార్ సైన్యం ఇంకా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది.

పిల్లలకు డ్యాన్స్‌తో పాఠాలు.. టీచర్‌కు నేషనల్ అవార్డు!
TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని MPP గర్ల్స్ ప్రైమరీ స్కూల్ టీచర్ భవానీకి జాతీయ గౌరవం దక్కింది. కేంద్ర విద్యాశాఖ అనౌన్స్ చేసిన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు. దేశంలో ఎంపికైన 48 మందిలో తెలంగాణ నుంచి భవానీ ఒక్కరే కావడం విశేషం. సెప్టెంబర్ 5న దిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. స్టూడెంట్స్‌కు ఈజీగా అర్థమయ్యేలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, డ్యాన్స్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందనలు తెలిపారు.

పత్తి పంటకు ముప్పు రాకుండా.. రైతులకు కీలక దిశానిర్దేశం
TG: పత్తి పంటలో చీడపీడలను తొలిదశలోనే గుర్తిస్తే నష్టాన్ని నివారించవచ్చని ఏఈఓ శ్రీనివాస్ రైతులకు సూచించారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో పత్తిపంటను ఆయన పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటలో చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలని, తెగుళ్లు లేదా పురుగుల ప్రభావం కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమస్యను గుర్తించకుండా సొంతంగా మందులు వినియోగించడం వల్ల పంటకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

కామారెడ్డిలో యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం
TG: యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఖలీద్ అహ్మద్ పిలుపునిచ్చారు. కామారెడ్డిలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, ఐవైసీ యాప్‌లో గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై చర్చించారు.

పీహెచ్‌సీలో కలెక్టర్ చెక్.. సిబ్బందికి షాక్ ట్రీట్‌మెంట్
TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. శుక్రవారం పీహెచ్‌సీని సందర్శించిన ఆయన ఓపీ రిజిస్టర్, వార్డు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న గర్భిణుల ప్రసవాల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటిస్తూ విధులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.

విజయ్ సర్కార్ భారీ డీల్.. ఆ పథకానికి డేట్ ఫిక్స్!
తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘థాయ్ మామన్ తంగ మోతిరం’ పథకానికి భారీ ఆర్డర్ ఖరారైంది. ఈ పథకం కింద 4.41 లక్షల గోల్డ్ రింగ్స్‌ను తయారు చేస్తారు. రూ.755 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌కు జోయాలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్ టెండర్లు దక్కించుకున్నాయి. టెండర్‌లో ఈ రెండు సంస్థలు తక్కువ రేటుకు కోట్ చేసాయి. దీంతో పనులను 70:30 రేషియోలో కేటాయించారు. మొదటి నాలుగు నెలల్లో 1,28,499 ఉంగరాలు సప్లై చేయనున్నారు. ఈ స్కీమ్‌ను సెప్టెంబర్ 15, మాజీ CM అన్నాదురై పుట్టినరోజున ప్రభుత్వం అమలు చేసే అవకాశముంది.

ICUలో ఏసీలు బంద్.. రోగులకు నరకయాతన
TG: ప్రాణాలు కాపాడాల్సిన ICUలోనే ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో అల్లాడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొంది. అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు అనుకూలమైన వాతావరణం ఎంతో అవసరమైనప్పటికీ, ICUలో ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బంధువులు తెలిపారు. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, ఐసీయూ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారులను కోరారు.

ఉయ్యూరులో డయేరియా కలకలం... పారాహుషార్
ఉయ్యూరు మున్సిపాలిటీ 5,7 వార్డులో డయేరియా ప్రబలింది. ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శుక్ర వారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. డయేరియా వ్యాప్తికి కారణాలు తెలు సుకునేందుకు నీటి నమూనాలను పరీక్షలకు పంపిన ట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పారు.

ప్రయాణికుల్లా వచ్చారు… డ్రైవర్‌ను ఎందుకు చంపేశారు?
ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌కు జైపూర్ ట్రిప్ అంటూ ఆఫ్‌లైన్ బుకింగ్ వచ్చింది. జూలై 20న సరితా విహార్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకున్న అతడిని మధ్యలోనే దాడి చేసి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని రాజస్థాన్‌లోని అడవుల్లో పడేసి, కారును కూడా తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. డబ్బుల కొరతతో కారును దోచుకోవాలనే ప్లాన్‌లోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివక్ష వద్దు అంటే ఆదివాసి విద్యార్థులను గదిలో వేసి కొట్టారు
మా school లో మమ్మల్ని వేధిస్తున్నారు. వివక్ష చూపెడుతున్నరు. దీనిని ఆపాలే.. అని ఏకలవ్య మోడల్ స్కూలు పిల్లలు అడిగారు. వినలేదు. నిరాహార దీక్ష కు కూసున్నరు. మూడు రోజులైంది. నీరసంగా ఉన్న ఆ పిల్లలను గదిలో వేసి కొట్టారు. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం ముత్తాపురం గ్రామం లో జరిగింది. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు ఒక్కసారిగా స్కూలుకు చేరుకున్నరు. స్కూలు గేటు ఎదురుగా బైఠాయించారు. పోలీసులు వచ్చిండ్రు. పరిస్థితి ఉద్రిక్తమైంది.

భారత స్టార్టప్‌లకు ఒక్క వారంలో $221M!
భారత స్టార్టప్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఫండింగ్ జోరందుకుంది. ఆగస్టు 21తో ముగిసిన వారంలో 17 డీల్స్ ద్వారా స్టార్టప్‌లు మొత్తం $221 మిలియన్లు వచ్చింది. ఇందులో సగానికిపైగా ఫండింగ్ ఒక్క Naviకే వచ్చింది. Sachin Bansal నేతృత్వంలోని Naviకి Prosus నుంచి $100 మిలియన్లు వచ్చాయి. మిగతా డీల్స్‌లో ఫిన్‌టెక్, AI, హెల్త్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్ వంటి రంగాల కంపెనీలు కూడా ఫండింగ్ తెచ్చుకున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ మొత్తం రెండింతలకు పైగా పెరిగింది.

SIR తిప్పలు... నా వయస్సు 35 సార్... 126 ఏళ్లేంటి సార్..
ఈ భూమిపై ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించబడిన (Verified) అత్యధిక కాలం బతికిన మనిషి ఫ్రెంచ్ మహిళ అయిన Jeanne Calment. ఆమె వయస్సు సరిగ్గా 122 yrs 164 days. కానీ మన ఎన్నికల అధికారులు, ఇంటింటికి సర్వే చేసి ప్రింట్ చేసిన జాబితాలో ఈ రికార్డులనే తిరగరాసేశారు. నర్సాపూర్ జి.తిమ్మాపూర్ గ్రామంలో ఓటర్ల జాబితాలో ఓ 35 ఏళ్ల యువకుడి వయస్సు 126 ఏళ్లుగా ముద్రించారు. తాను వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడనుకోవాల్నో, నన్ను అంత పండు ముసలిని చేశారేంట్రా నాయనా అనుకోవాల్నో అర్థం కాక ఆ యువకుడు బ్లాంక్ అయిపోయాడు.

129 బోగీలు, 3 ఇంజిన్లు… ‘ఆవధ్ మహాశక్తి’
భారత రైల్వేలో ఒకేసారి 129 బోగీలు, 3 ఇంజిన్లతో నడిచిన ‘ఆవధ్ మహాశక్తి’ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే మూడు గూడ్స్ ట్రైన్లను కలిపి ఈ భారీ ఫ్రైట్ ట్రైన్‌ను నడిపింది. గోండా నుంచి సీతాపూర్ మీదుగా మురాదాబాద్ వైపు వెళ్లిన ఈ రైలు సుమారు 160 కి.మీ ప్రయాణించింది. సగటున గంటకు 42 కి.మీ వేగంతో ఈ దూరాన్ని 3 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసింది. ఒకే ట్రిప్‌లో ఎక్కువ సరుకును తరలించడం వల్ల సమయం, ఇంధనం, రైల్వే వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

రిజర్వేషన్ హటావో ఆందోళన కారుల డిమాండ్లు ఇవే!
CJP లాగే సోషల్ మీడియాలో పుట్టి జంతర్ మంతర్ ధర్నాతో గ్రౌండుకు చేరిన రిజర్వేషన్ హటావో ఆందోళన (RHA) డిమాండ్లు ఏంటంటే.. (1) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుల ఆధారిత రిజర్వేషన్లు తీసేసి, కేవలం ఆర్థిక ప్రాతిపదికనే కోటా ఇవ్వాలి (2) వన్ ఫ్యామిలీ, వన్ రిజర్వేషన్ (౩) అప్లికేషన్స్ నుంచి కులం కాలమ్‌ను పూర్తిగా తొలగించాలి (4) UGC కొత్తగా తెచ్చిన Caste Equality రూల్ తీసెయ్యాలి (5) రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ కఠినంగా అమలు చెయ్యాలి. RHA డిమాండ్స్ పై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్ సెంటర్: CM రేవంత్‌రెడ్డి
తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి CM రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లండన్‌లోని 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన CM.. తెలంగాణలో విద్యాపరమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు సహకరించాలని యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువత, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించాలని కోరారు.

రైతుల హక్కులకు పూర్తి రక్షణ: మంత్రి పొంగులేటి
TG: భూముల రీసర్వే తర్వాత అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్కులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జగిత్యాలలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నకిలీ పాస్‌బుక్కులను గుర్తించి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్‌బుక్కుల ఆధారంగా అనర్హులు రైతుబంధు ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. భూ రీసర్వే పూర్తయిన తర్వాత నిజమైన రైతుల హక్కులను కాపాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

రిజర్వేషన్ హటావో ఆందోళనపై పోలీసుల సంచలన ప్రకటన
రిజర్వేషన్ హటావో ఆందోళన కారులకు జంతర్ మంతర్లో ధర్నా చేసే పర్మిషన్ లేదని ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి జంతర్ మంతర్లో ప్రొటెస్టుకు దిగిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఉందన్న ప్రచారం తప్పు అన్నారు. శాంతిభద్రతల కోణంలోనే జంతర్ మంతర్ ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదనీ.. అయితే రాంలీలా మైదానంలో మాగ్జిమమ్ 500 మందితో పీస్ ఫుల్ ప్రొటెస్టుకు పర్మిషన్ ఇచ్చాం అన్నారు. ఈ రూల్స్ పాటించకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని Xలో ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.

ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు: ఈశ్వర్ శంకర్
AP: ప్రభుత్వం 8నెలలుగా తమ డిమాండ్లపై స్పందించకపోవడం వల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఏపీ జూడా రాష్ట్ర అధ్యక్షుడు యు.ఈశ్వర్ శంకర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్‌ను 20శాతం పెంచాలని, ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసును 65ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, నాన్ క్లినికల్ పోస్టులను అర్హత కలిగిన వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమతో చర్చించకుండా 3శాతం స్టైపెండ్ పెంపును ప్రకటించడం సరికాదన్నారు. సానుకూల స్పందన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై హైదరాబాద్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించాలని, నీటిని వృథా చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జంతర్ మంతర్లో మరో మూమెంట్, రాత్రంతా ఉద్రిక్తత.. అరెస్టులు
'రిజర్వేషన్ హఠావో ఆందోళన' (HRA) అనేది CJP లాగే సోషల్ మీడియాలో పుట్టిన మరో మూమెంట్. ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న వాళ్లు ఆగస్ట్ 21న ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ కులం ఆధారంగా కాకుండా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఉండాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది వచ్చారు. ఈ ప్రొటెస్టుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే భారీ ఎత్తున ఆందోళనకారులు జంతర్ మంతర్ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడంతా భారీగా పోలీసు బలగాలను దించి ఎవరూ రాకుండా చూస్తున్నారు.