Latest
భుజంపై మొసలిని మోసుకొని పోలీస్ స్టేషన్‌కు.. ఆ తరువాత
బీహార్ సుపౌల్ జిల్లాలోని 5 అడుగులున్న మొసలి వరి పొలంలోకి వచ్చింది. అక్కడే పొలంలో పని చేసుకుంటున్న రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రైతులందరు దైర్యం చేసి ఆ మొసలిని జాగ్రత్తగా తాళ్లతో కట్టేశారు. మొసలి ఎవరిపై దాడి చేయకుండా అమిత్ కుమార్(రైతు) దాన్ని నోరిని కూడా తాళ్లతో కట్టాడు. మొసలిని భుజంపై మోసుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. మొసలిని హ్యాండోవర్ చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర్లోని ఓ నదిలో వదిలేశారు. దింతో ఆ రైతు మోసుకొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది.

లష్కర్ బోనాల జాతరలో CM రేవంత్ రెడ్డి
TG: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు. ఈ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.

కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో గొంతుకోసి..
TG: జనగామ జిల్లాకు చెందిన రజిత, నర్సంపేట మండలానికి చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం నెలరోజుల క్రితం వరంగల్ నగరానికి వచ్చి కృష్ణాకాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతుండగా, రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన అనిల్.. భార్య రజిత చేతులు, కాళ్లు కట్టి కత్తితో మెడ కోసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నేడు జాతీయ జెండా రూపకర్త 'పింగళి వెంకయ్య' జయంతి
ఈరోజు ఇండియన్ ఫ్లాగ్‌ను డిజైన్ చేసిన పింగళి వెంకయ్య 150వ జయంతి. 1876 ఆగస్ట్ 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. అయన ఒక వ్యవసాయ పరిశోధకుడు, విద్యావేత్త కూడా, మచిలీపట్నంలో ఒక విద్యాసంస్థను స్థాపించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఉన్న త్రివర్ణ పతాకం వెనుక ఆయన కృషి మరువలేనిది, తెలుగువారికీ గర్వకారణం. నేడు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ముఖ్యనేతలు, ప్రముఖులు స్మరించుకుంటున్నారు.

IPL ముంబయి టీమ్ లో హార్దిక్ పాండ్య ఉంటాడా?
హార్దిక్ పాండ్య IPLలో ముంబయి ఇండియన్స్ నుంచి వేరే టీమ్‌కి వెళ్తాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి వెళ్తాడని, శివమ్ దూబేని తీసుకుని పాండ్యను చెన్నైకి ఇచ్చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై ముంబయి టీమ్ ఒక క్లారిటీ ఇచ్చింది. "మేము ఇంకా ఈ సీజన్ ఎలా జరిగిందో రివ్యూ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఏ ఆటగాడిని ట్రేడ్ చేసే ఆలోచన చేయలేదు. ఎవరితో చర్చలు కూడా జరపలేదు. మా రివ్యూ పూర్తయ్యాకే దీని గురించి ఆలోచిస్తాం అని వాళ్ళు అన్నారు.

దీప్కే తండ్రిపై ఇంక్వైరీ చేయాలి: RTI యాక్టివిస్ అమిత్ తివారీ
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తండ్రిపై ఇంక్వైరీ చేయాలని RTI యాక్టివిస్ట్ అమిత్ తివారీ EC, ఇన్‌కమ్ ట్యాక్స్ అథారిటీస్‌కు లెటర్ రాశారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన తన కొడుకు ఫారిన్ చదువులకు ఇంత డబ్బులు ఎక్కడిదని క్వశ్చన్ చేశారు. పోలీసు కేసులున్న CJP ప్రొటెస్టర్లకు సీనియర్ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన రూ.1 కోటిపై విచారణ జరపాలని కోరారు.

విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్
AP: స్నేహితుల దినోత్సవం రోజున విశాఖపట్నం గాజువాక పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్‌షిప్ డే వేడుకల కోసం వచ్చిన స్నేహితుల్లో నీతూ, రాము అనే యువతి, యువకుడు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు తీస్తున్న సమయంలో నీతూ అలల్లో కొట్టుకుపోగా, ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన రాము కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్‌ల వద్ద అలలు ఉధృతంగా ఉన్నందున సముద్ర తీరాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ.. లేదంటే నో: కోమటిరెడ్డి
TG: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తేనే తాను పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలం కంచనపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అత్యధిక మెజార్టీ ఇవ్వలేకపోతే తాను ఎన్నికల బరిలో ఉండనని స్పష్టం చేశారు. తాను నియోజకవర్గానికి ప్రచారం కోసం రాకపోయినా, ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు.

స్వీట్ షాప్‌పై లీగల్ యాక్షన్
TS: హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ ఎక్స్‌రోడ్ ట్వింకల్ స్టార్ స్వీట్ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ పాటించనట్లు గుర్తించారు. H-Fast పోలీస్ SI పి. కృష్ణయ్య, వారి టీమ్ అధికారులతో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఇందులో స్వీట్స్ తయారు చేసేవారికి హెయిర్‌నెట్స్, గ్లౌజులు, ప్లేస్ క్లీన్‌గా లేకపోవడం వంటివి గుర్తించారు. పెస్ట్ కంట్రోల్స్ రికార్డ్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్, FSSAI లైసెన్స్‌ను డిస్‌ప్లేలో లేకపోవడం గమనించారు. దీంతో లీగల్ యాక్షన్ కోసం ఈ కేసును ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు అప్పగించారు.

గోదావరి ఉధృతి.. లంక గ్రామాలు ఖాళీ
AP: గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. <a href="https://www.theclearcutnews.com/n/WGhyzXK">ధవళేశ్వరం</a> బ్యారేజీ నుంచి 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉధృతికి ఇళ్లు, రోడ్లు తీవ్ర కోతకు గురవుతుండటంతో గురజాపులంకలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

కిరాణా షాపులో నాగుపాము
TG: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తాండూరు–కోకట్ మధ్య ఉన్న ఓ కిరాణా షాపులోకి నాగుపాము చొరబడటంతో షాపు యజమాని భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ సాహసం చేసి నాగుపామును సురక్షితంగా పట్టి బయటకు తీశారు. దీంతో షాపు యజమానితో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పాములు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.
దేవాలయంలో రీల్స్.. వివాదంగా మారిన వీడియో
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆలయ గోపురం ఎదుట పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఎలా అనుమతించారని, సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రీల్స్ చిత్రీకరణకు కొంత సమయం పట్టిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు.

GMRను ఎందుకు మాట్లాడించలేదు: గుడివాడ
AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అయితే, విమానాశ్రయం నిర్మాణానికి అసలు క్రెడిట్ YS జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. YSRCP హయాంలో భూసేకరణ పూర్తి చేసి, న్యాయ వివాదాలు పరిష్కరించి, నిర్మాణ పనులు వేగవంతం చేశామని చెప్పారు. కార్యక్రమంలో GMR సంస్థ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. GMR మాట్లాడితే విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలిసేవని అన్నారు.

ఫ్రెండ్స్‌తో విహారం.. అంతలోనే విషాదం
AP: అస్సాంలోని గువాహటిలో చదువుతున్న కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ కాచన సాయినాథ్ రెడ్డి ఏకైక కుమార్తె, IIT ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చేతన(20) బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లి జారిపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం అధికారులు మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కుటుంబసభ్యులతో కలిసి వెంటనే అస్సాంకు బయలుదేరారు. చేతన స్వగ్రామం కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి గ్రామం.

ప్రతి ఇంట సంతోషం నిండాలి: పొన్నం
తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

జలదిగ్బంధంలో గ్రామాలు.. పడవల్లోనే ప్రయాణం
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే వరద నీటిలో మునిగిపోయింది. కాజ్‌వేపై రెండు అడుగుల మేర నీరు ప్రవహించడంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నం లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు చాకలిపాలెం, కనకాయలంక, ఎదురుబిడియం కాజ్వేలు కూడా మునిగిపోవడంతో లంక గ్రామాల ప్రజల కోసం పడవలను ఏర్పాటుచేసి రవాణా కొనసాగిస్తున్నారు.

అప్పు తీర్చలేదని ఇల్లు అమ్మేశాడు
AP: తనకు రావాల్సిన రూ.40వేల అప్పు కోసం గిరిజన మహిళకు తెలియకుండానే ఆమె ఇంటిని విక్రయించిన ఘటన తిరుపతి జిల్లా KVB పురం మండలం అంజూరు గిరిజన కాలనీలో వెలుగులోకి వచ్చింది. భర్త శీనయ్య మృతి అనంతరం నందిని తన పిల్లలతో కలిసి అమ్మగారి ఇంటికి వెళ్లింది. గ్రామ మాజీ సర్పంచి శ్రీజయ భర్త సురేష్ తన ఇంటిని రూ.2 లక్షలకు విక్రయించినట్లు ఆమె ఆరోపించింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉండటంతో విషయం తెలిసిందని వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మద్యం మత్తు.. బస్సుతో లాంగ్ డ్రైవ్
AP: మద్యం మత్తులో ఓ వ్యక్తి RTC బస్సునే చోరీ చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గార్లదిన్నెకు చెందిన డి.శివశంకర్ రాత్రి తన పెంపుడు కుక్కతో కలిసి కదిరికి చేరుకుని, బస్టాండ్‌లో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును తీసుకెళ్లాడు. మద్యం మత్తులో డివైడర్లు, చెట్లను ఢీకొడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తట్టివారిపల్లె వరకు వెళ్లాడు. అనంతరం బస్సును అక్కడే నిలిపి జరిగిన విషయాన్ని మదనపల్లె బస్టాండ్ సిబ్బందికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఫారెస్ట్ ఆఫీస్‌లోకి చొరబడి రాళ్ల దాడి
TG: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో అధికారులపై దాడిచేసి, రూ.50వేల ఆస్తి నష్టం చేసిన ఘటనలో 17మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీ ప్రాంతంలోని ROFR భూముల్లో ట్రాక్టర్‌తో దున్నడం నేరమని అటవీ సిబ్బంది రైతులకు చెప్పినా వినకుండా దున్నుతున్నారని అధికారులు తెలిపారు. కొందరు పోడు రైతులు, నాయకులు అటవీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం ఆఫీస్‌లోకి చొరబడి అధికారులను నిర్బంధించి బండరాళ్లతో దాడి చేసినట్లు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ధవళేశ్వరం వద్ద రెడ్ అలర్ట్
AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గి 54.3 అడుగులకు చేరినా, ఆ వరద నీరు దిగువకు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద 13.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాజ్‌వేలు దాటవద్దని హెచ్చరించారు.

డాక్టర్ నంబర్ కోసం వెతికితే.. డబ్బు మాయం
TG: హైదరాబాద్‌లోని నాగోల్ వాణీనగర్‌కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శెట్టి వేణుగోపాల్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్ వెతికారు. నకిలీ నంబర్‌కు కాల్ చేయగా, సైబర్ మోసగాళ్లు రూ.5 చెల్లించాలని చెప్పి వాట్సాప్‌లో APK ఫైల్ పంపించారు. దానిని ఇన్‌స్టాల్ చేయగానే మొబైల్ స్తంభించిపోయి, బ్యాంకు ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశారు. బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.