Latest

రేపు ఇందిరా పార్క్ వేదికగా BRSV నిరసన.. కేటీఆర్ హాజరు
News· 23 Jul 2026

రేపు ఇందిరా పార్క్ వేదికగా BRSV నిరసన.. కేటీఆర్ హాజరు

TG: దిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(BRSV) జులై 24 ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరసన చేపట్టనున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కేంద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విద్యార్థులు, యువత పాల్గొనాలని BRSV పిలుపునిచ్చింది.

ఆత్మహత్యకు ముందు షాకింగ్ సూసైడ్ నోట్
Crime· 23 Jul 2026

ఆత్మహత్యకు ముందు షాకింగ్ సూసైడ్ నోట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందిన యువకుడు, ఆత్మహత్యకు ముందు SIR ఫాం మీద రాసిన సూసైడ్ నోట్‌లో తన చావుకు ప్రధాని మోడీ కారణమని పేర్కొన్నాడు. అలాగే తన కుటుంబసభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం నిర్వహించాలని కోరాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నీట్ వ్యవహారంలో కేంద్రం జవాబుదారీతనం వహించాలి: అన్నామలై
Politics· 23 Jul 2026

నీట్ వ్యవహారంలో కేంద్రం జవాబుదారీతనం వహించాలి: అన్నామలై

నీట్ ప్రవేశ పరీక్షకు ఇప్పటివరకు మద్దతుగా నిలిచిన కె.అన్నామలై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నీట్ వ్యవహారంపై జవాబుదారీతనం కోరారు. వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ రావడం సహజమేనని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

CJP నిరసనకు మద్దతుగా తమిళ సినీ డైరెక్టర్స్
India· 23 Jul 2026

CJP నిరసనకు మద్దతుగా తమిళ సినీ డైరెక్టర్స్

CJP నిరసనకు తమిళ సినీ డైరెక్టర్స్ మద్దతు పలికారు. ‘No more NEET’ నినాదంతో చైన్నె నగరంలోని రాజరత్నం స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిరసన కార్యక్రమం జరుగనుంది. ఇందులో దర్శకులు వెట్రిమారన్, పా.రంజిత్, అమీర్ పాల్గొననున్నారు.

విద్యార్థులకు మద్దతుగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా?
News· 23 Jul 2026

విద్యార్థులకు మద్దతుగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా?

ముంబైలోని దాదర్ ప్రాంతంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదేశంలో బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్ విద్యార్థుల హక్కుల కోసం మద్దతుగా నిలిచినందుకు ముంబై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తను కేవలం శాంతియుతంగా నిలబడి ఉన్నానని, ఎలాంటి నినాదాలు చేయలేదని ఆమె తెలిపారు. రోడ్డుపై నిలబడటమే నేరమా అని పోలీసులను ప్రశ్నించారు. మూడు గంటల కస్టడీ తర్వాత ఆమెను వర్లీ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, ప్రకాష్ రాజ్ విద్యార్థులకు, ఆయేషాకు మద్దతు తెలిపారు.

కలెక్టర్ వినూత్న తనిఖీలతో స్కూల్స్‌లో మార్పు
Education· 23 Jul 2026

కలెక్టర్ వినూత్న తనిఖీలతో స్కూల్స్‌లో మార్పు

కేరళంలోని అల్లపుజ జిల్లా కలెక్టర్ ఎస్.సుహాన్ వినూత్న కార్యక్రమంతో ప్రశంసలు అందుకుంటున్నారు. 2012 IAS బ్యాచ్‌కు చెందిన ఆయన, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు తరచూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నీరుకున్నమ్‌లోని శ్రీదేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో పిల్లల మధ్య కూర్చుని భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వయనాడ్‌లో కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా గిరిజన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల సంఖ్య పెంచారు. కలెక్టర్ తనిఖీలతో స్కూల్స్ అన్నీ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ స్కూల్‌కు వచ్చి భోజనం చేస్తారోననే భయం పట్టుకుంది.

30 ఏళ్లుగా కనిపించని కొడుకు..ఎలా దొరికాడంటే!
News· 23 Jul 2026

30 ఏళ్లుగా కనిపించని కొడుకు..ఎలా దొరికాడంటే!

AP: పదో తరగతిలో ఫెయిల్ అయ్యాననే భయంతో 1996లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రాముడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో ఉంటూ అక్కడే కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఇటీవల SIR అప్లికేషన్ నింపే సమయంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో సొంత ఊరు గుర్తుకొచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఎమ్మిగనూరుకు వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
Crime· 23 Jul 2026

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

TG: ఉదయం లక్డీ-కా-పుల్‌లోని డీజీపీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో స్వామి అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దగ్గర లభించిన లేఖలో 'తన భార్యాపిల్లల గురించి ఎవరూ ఏమీ అనకూడదని, తాను చనిపోయి దెయ్యంగా మారినా వారిని చూసుకుంటూనే ఉంటానని, వారు మంచివారని' రాశాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

పేపర్ లీక్‌లపై మోదీ ఫస్ట్ రియాక్షన్
India· 23 Jul 2026

పేపర్ లీక్‌లపై మోదీ ఫస్ట్ రియాక్షన్

నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడేవారికి వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యువత భవిష్యత్తు, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి, త్వరగా శిక్షలు పడేలా ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని, ఈ ప్రక్రియను వెంటనే అమలు చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని మోదీ స్పష్టం చేశారు.

యువకుడి కంటిపై పెల్లెట్ ప్రభావం
India· 23 Jul 2026

యువకుడి కంటిపై పెల్లెట్ ప్రభావం

ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన ఆందోళనలో ఒక నిరసనకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆందోళన సమయంలో పెల్లెట్లు కంటిలోకి దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆయన్ని మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కన్నును కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP పిలుపునిచ్చిన ఆందోళన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారు.

మైనింగ్ అధికారుల పేరుతో దందా
TG· 23 Jul 2026

మైనింగ్ అధికారుల పేరుతో దందా

TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని, భారీ పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ రంగంపై దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అధికారుల వేధింపులతో తమ ఉపాధి సంక్షోభంలో పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి, తమను కాపాడాలని వారు కోరారు.

విద్యాసంస్థల బంద్ పిలుపు
Education· 23 Jul 2026

విద్యాసంస్థల బంద్ పిలుపు

నీట్, ప్రశ్నాపత్రాల లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ, రేపు (ఈ నెల 24న) AP, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బంద్‌లో పాల్గొనాలని కోరాయి. SFI, PDSU, AISF, NSUI తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలపై విచారణ వంటి డిమాండ్లతో బంద్ నిర్వహించనున్నారు.

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి
AP· 23 Jul 2026

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి

AP: తిరుపతి జిల్లా రేణిగుంటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో బీటెక్ విద్యార్థి రాకేశ్‌పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయ్, సుజన్, శ్రీను అనే ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల ముగిసిన తర్వాత జిరాక్స్ షాప్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో గొడవ జరిగిందని, విజయ్ కూల్‌డ్రింక్ బాటిల్‌తో తలపై కొట్టడంతో గాయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి చేతులతో, కాళ్లతో దాడి చేయడంతో రాకేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

‘పెద్ది’ పోస్టర్‌తో అలిపిరిలో హల్‌చల్
Cinema· 23 Jul 2026

‘పెద్ది’ పోస్టర్‌తో అలిపిరిలో హల్‌చల్

AP: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ మహిళ ‘పెద్ది’ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. శ్రీవారి క్షేత్రంలో సినిమా, రాజకీయ ప్రచారాలకు TTD కఠిన నిషేధం ఉన్నప్పటికీ పోస్టర్‌తో తిరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిబంధనలు అమల్లో ఉన్నా, భద్రతా సిబ్బంది ఈ ఘటనను అడ్డుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. TTD చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం▶
TG· 23 Jul 2026

ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం

TG: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ప్రతిఒక్కరూ దేశవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించాలని ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ JAC పిలుపునిచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగే ఈ సంఘీభావ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీయువకులు పాల్గొనాలన్నారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు చేసిన లాఠీచార్జీని, నిర్బంధాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది.

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం
AP· 23 Jul 2026

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం

AP: రాయలసీమలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను ప్రైవేట్ కంపెనీలు మోసం చేస్తున్నాయని CPM రాష్ట్ర కార్యదర్శి V. శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీల అగ్రిమెంట్లలో అనేక లొసుగులు ఉన్నాయని, ప్రభుత్వం రైతులకు ఎలాంటి కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడం లేదన్నారు. రైతుల భూములను తాకట్టు పెట్టి కంపెనీలు వందల కోట్ల రుణాలు ఎలా పొందుతున్నాయని ప్రశ్నించారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వని వ్యవస్థ, పారిశ్రామికవేత్తలకు మాత్రం అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం థర్డ్ పార్టీగా జోక్యం చేసుకుని రైతులకు భద్రత కల్పించి, న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినీతి ముత్యం అక్రమాస్తుల చిట్టా బట్టబయలు
Crime· 23 Jul 2026

అవినీతి ముత్యం అక్రమాస్తుల చిట్టా బట్టబయలు

తెలంగాణ రెడ్కో DE ముత్యం వెంకటరమణ అవినీతి కేసులో ACB అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు నాలుగు ఫ్లాట్లు, రెండు వాణిజ్య భవనాలు, రూ.52 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రెండు కిలోల బంగారం, విలువైన వాహనాలను సీజ్ చేశారు. సోదాల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ACB లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.27.65 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు
AP· 23 Jul 2026

చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు

AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. 1996లో పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై ఇంటి నుంచి ముంబయికి వెళ్లిపోయిన రాముడు అనే యువకుడు 30 ఏళ్ల తర్వాత భార్య సుశీల, కుమార్తె సంజనతో కలిసి సొంతూరుకు చేరుకున్నాడు. SIR కోసం తల్లిదండ్రుల వివరాలు అవసరమవడంతో తన పాత ఇంటిని వెతికాడు. రెండురోజులు వెతికిన తర్వాత వాకిట్లో ఉన్న తల్లిని గుర్తించి పిలిచాడు. మొదట గుర్తుపట్టని ఆ తల్లి, అతడు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పగానే భావోద్వేగానికి లోనైంది. చనిపోయాడనుకున్న కుమారుడు తిరిగి రావడంతో ఆమె ఆనందంతో మురిసిపోయింది.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
Politics· 23 Jul 2026

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

TG: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని, ఆయనను కేంద్ర క్యాబినెట్‌ నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని CM రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే తెలంగాణ నుంచే ‘సడక్‌ సే సంసాద్‌’ వరకు పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలపై పోలీసుల దాడిని ఖండించారు. ఈ పోరాటం కాంగ్రెస్‌, BJP మధ్య కాదని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు.

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్
Crime· 23 Jul 2026

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

AP: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి రూ.15 కోట్లు మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని కడప రిమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన కిచ్చా వీరభద్రరావు అలియాస్ కేవీ రావు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ సంస్థలు నడుపుతూ AP, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. కడపకు చెందిన ఇద్దరు మహిళలను రూ.55 లక్షల నమ్మించి మోసం చేసిన కేసులో అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

నీట్ నిరసనలతో హీటెక్కిన హైదరాబాద్‌
TG· 23 Jul 2026

నీట్ నిరసనలతో హీటెక్కిన హైదరాబాద్‌

TG: నీట్ పేపర్ లీకేజీ నిరసనలు హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్, BJP నేతలు పరస్పరం ఒకరి రాష్ట్ర కార్యాలయాలను మరొకరు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన BJP నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కాంగ్రెస్ నేతలు BJP ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, కర్రలు, రాళ్లతో దాడులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు.