Crime

తమ కుమార్తెది ఆత్మహత్య కాదు, హత్య చేశారు
Crime· 3 Jul 2026

తమ కుమార్తెది ఆత్మహత్య కాదు, హత్య చేశారు

TG: హైదరాబాద్‌ లంగర్‌హౌస్ PS పరిధిలోని ఓ హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు క్లబ్ డ్యాన్సర్ రేణుక(26)గా గుర్తించారు. ఫారూఖ్ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్ చేసుకుంది. ఫారూఖ్ బయటకు వెళ్లి వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. రేణుకది ఆత్మహత్య కాదని, హత్య చేశారని యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు.

నకిలీ ఆర్మీ ఆఫీసర్ డ్రామా.. యువకుడు అరెస్ట్
Crime· 3 Jul 2026

నకిలీ ఆర్మీ ఆఫీసర్ డ్రామా.. యువకుడు అరెస్ట్

TG: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు నాగోల్ CI మక్బూల్ జాని తెలిపారు. శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్(29) ఆర్మీ ఆఫీసర్ నంటూ నకిలీ AI ఫొటోలతో సోషల్ మీడియా ద్వారా నాగోల్ పరిధిలోని ఆనంద్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆమె నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ముఖం చాటేసి బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి ఇప్పటికే పెళ్లైనట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం
Crime· 2 Jul 2026

పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం

AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన యువతిని, ఇనిమెళ్ల విలేజ్‌కు చెందిన మల్లవరపు శాంతివర్ధన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పటికే మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపణలు రావడంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెళ్లికూతురు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఈపూరు PS ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

గాదె సాయికృష్ణ కేస్: రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!
Crime· 1 Jul 2026

గాదె సాయికృష్ణ కేస్: రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు నిజాలు చెప్పలేదని, మొబైల్స్ అడిగితే నాగపూర్‌లో ఎవరో తెలియని వాళ్ళకి అమ్మేసామని అబద్ధాలు చెప్తున్నారని పోలీసులు వెల్లడించారు. మే 5న సాయికృష్ణ లొకేషన్ మార్కాపురంలో చూపించింది. కోర్టులో హాజరుపరిచే డేట్ కంటే ముందే నిందితుడిని బంధించారని, FIRలో ఉన్నవాళ్లంతా కలిసే సాయికృష్ణను మిస్ చేశారని రిపోర్టులో mention చేశారు. దీనిపై ఇంకా ఫుల్ ఎంక్వైరీ జరగాల్సి ఉంది.

మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్
Crime· 30 Jun 2026

మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్

TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ PS పరిధిలోని బహుదూర్‌పల్లి మెయిన్ రోడ్‌పై మద్యంమత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకును బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లతారెడ్డి(49) స్పాట్‌లోనే మృతిచెందగా.. కొడుకు వేదాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వేదాంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అలాగే లతారెడ్డి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.